chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్

జగ్గయ్యపేట పురపాలక సంఘ ఆధ్వర్యంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

జగ్గయ్యపేట పురపాలక సంఘ ఆధ్వర్యంలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం అత్యంత విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజ్‌గోపాల్ (తాతయ్య), కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట మునిసిపల్ చైర్మన్ రాఘవేంద్ర రంగాపురం,వైస్ చైర్మన్లు,కౌన్సిలర్లు, సీఐ, ఎంఆర్ఓ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 4,000 మంది పైగా ప్రజలు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, మహిళలు, పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేసి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఈ సందర్బంగా MLA శ్రీరాం రాజ్‌గోపాల్ తాతయ్య మాట్లాడుతూ
“ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి వల్ల యోగా విశ్వవ్యాప్త గుర్తింపు పొందిందని, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆరోగ్యం, సంక్షేమం ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతోందని,యోగా సాధనతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, రోగనిరోధక శక్తి పెరుగుతాయని,ఒత్తిడి, అలసట తగ్గి, జీవనశైలి సంబంధిత వ్యాధులు దూరమవుతాయని, అందరూ యోగా ను ప్రతిరోజూ ఆచరించాలని పిలుపునిచ్చారు.”

కెడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ “ప్రధానమంత్రి ప్రేరణతో యోగా ఒక గ్లోబల్ ఉద్యమంగా మారింది. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో రాష్ట్రంలో ఆరోగ్యం, సంక్షేమం ప్రోత్సహించబడుతున్నాయి. యోగా ద్వారా రక్తప్రసరణ మెరుగుపడటం, శ్వాసకోశ సామర్థ్యం పెరగటం, మానసిక ఆరోగ్యం మెరుగవ్వటం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ తరహా కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సమాజ ఆరోగ్యానికి దోహదపడుతుంది.” అని తెలియజేశారు

మునిసిపల్ చైర్మన్ రాఘవేంద్ర రంగాపురం మాట్లాడుతూ
“యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, అది ‘ప్రాణానికి ప్రాణం’ (Yoga gives life to life) వంటిది. ఇది ఒక సమగ్ర జీవన పద్ధతి, ఒక వ్యక్తి తన శరీరంపైనే కాదు, మనసుపైన కూడా నియంత్రణ సాధించుకునే శక్తివంతమైన వ్యవస్థ. యోగా ప్రతి పాఠశాలలో బోధించబడాలని, ప్రతి పాఠశాలలో రోజుకు కనీసం ఒక గంట యోగా తరగతి ఉండాలని మేము దృఢంగా నమ్ముతున్నామని ఈ అంశంపై మునిసిపల్ కౌన్సిల్ తరఫున మన ప్రియమైన విద్యాశాఖ మంత్ర నారా లోకేశ్ కి ఒక వినతిపత్రం సమర్పిస్తాము. పీఎం, సీఎం మార్గదర్శకత్వంలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూ, ప్రజలకు ఆరోగ్యం మరియు సుఖశాంతి అందించేందుకు మునిసిపాలిటీ కట్టుబడి ఉంది.” అని అన్నారు.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)
Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Product
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Product
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినందుకు పురపాలక సంఘ అధికారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker