ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.రాష్ట్ర సచివాలయానికి ఈనెల 25వతేదీ సెలవు దినమైనందున 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈనెల 24వ తేది శుక్రవారం ఉ.11 గం.లకు సచివాలయం మొదటి భవనం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున సచివాలయంలో గల అన్ని శాఖల అధికారులు,సిబ్బంది ఈజాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ప్రతిజ్ణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ముకేశ్ కుమార్ మీనా తెలియజేశారు.
232 Less than a minute