గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార కట్టడాలను, లే అవుట్లను ఉపేక్షించబోమని, ఎక్కడైనా అనధికార నిర్మాణాలు జరిగితే ప్రజలు నేరుగా కమిషనర్ పర్యవేక్షణలో ఉండే 98499 08391 నంబర్ కి వాట్సప్ ద్వారా తగిన ఆధారాలతో(ఫొటోలు, వీడియోలు) ఫిర్యాదు చేయవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో నిర్మాణాలు జిఎంసి నుండి నిర్దేశిత అనుమతులు పొందిన అనంతరమే చేపట్టాలని, అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తే నిర్మాణాన్ని కూల్చివేయడంతో పాటు నిర్మాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే భాధ్యులైన సిబ్బంది, అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనధికార నిర్మాణాలు, లే అవుట్లపై ఫిర్యాదులు స్వీకరణకు ప్రత్యేకంగా కమిషనర్ చాంబర్లోని 98499 08391 నంబర్ ని కేటాయించామన్నారు. సదరు ఫిర్యాదులను నేరుగా తామే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నగర ప్రజలందరూ నిర్మాణ, లే అవుట్ల అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే నిర్దేశిత గడువులోపు మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.