chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

అనధికారిక మాంసం విక్రయాలపై చర్యలు

CORPORATION ACTION

గుంటూరు నగరంలోని రోడ్లపై నాటు కోళ్ళు, చేపల అనధికార విక్రయాలపై ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కమీషనర్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు బృందాలుగా ఏర్పడి నగరంలోని చుట్టుగుంట, నల్లపాడు రోడ్డు,మిర్చియార్డ్, ఆర్.టి.ఓ ఆఫీసు, గుజ్జనగుండ్ల, అమరావతి రోడ్డు మరియు పట్టాభిపురం ప్రాంతాలలో రోడ్ల పై అనధికారికంగా చేపలు, నాటుకోళ్ళు మరియు మేకలను వధించి విక్రయిస్తున్న వారిని గుర్తించి దాడులు నిర్వహించారు. వాటిని తొలగించి, అపరాధ రుసుము క్రింద రూ. 12,500 రూపాయలను విధించామని తెలిపారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో ఎక్కడైనా అనధికారికంగా నాటుకోళ్ళు, చేపలు మరియు మాంసం విక్రయాలు జరుపు వారిపై కఠిన చర్యలు, భారీ మొత్తంలో అపరాధ రుసుము విధించడమే కాక వారి పై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. నగరంలో మాంసం విక్రయాలు జరిపే యజమానులు సంబంధిత డాకుమెంట్స్ అందజేసి డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించుకోవాలని చెప్పారు. లైసెన్స్ లేని వారి షాపులను సీజ్ చేయుట జరుగుతుందని తెలిపారు. నగరంలో అనధికార మాంస విక్రయాలను అరికట్టుటకు నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి సదరు షాప్ ల పై దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
మాంసం విక్రయించే షాపుల యజమానులు షాపు చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసం పై దుమ్ము, ధూళి పడకుండా మెస్ లను కట్టి ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలియచేశారు. అంతేకాక శుభ్రత పాటించని షాపుల పై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో యం.హెచ్.ఓ డాక్టర్ రవిబాబు, వెటర్నరి డాక్టర్ వెంకటేశ్వర్లు, యస్.యస్ ఆనందకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సి.హెచ్ శ్రీనివాస్, నాగేశ్వర రావు, రాము, దాస్ ఇతర ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker