Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

ఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబే : మాజీమంత్రి ప్రత్తిపాటి.

పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట


ఆంధ్ర రాష్ట్రానికే మణిహారమైన విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవానికి, కేంద్రప్రభుత్వం అందించిన ఆర్థిక ప్యాకేజీ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, కృషి ఎంతో ఉన్నాయని చెప్పడానికి గర్విస్తున్నాను అని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నానుడిని శాశ్వతం చేస్తూ, ఆంధ్రులందరూ గర్వంతో ఛాతీ ఉప్పొంగేలా చేసిన ఘనత ప్రజల ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తిరిగి నిలబెట్టిన చంద్రబాబు కార్యాచరణపై రాష్ట్రప్రజానీకం నుంచి ప్రశంశల వర్షం కురుస్తోంది. తనపై ఉన్న అవినీతి కేసుల్ని తొలగిస్తే, ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ… రాష్ట్రమే తన కుటుంబం… రాష్ట్రాభివృద్ధే తన సంకల్పమంటూ అడుగులు వేస్తున్న చంద్రబాబు ఎక్కడా అని ఆంద్రులతో పాటు ప్రపంచంలోని తెలుగుజాతి మొత్తం ముక్తకంఠంతో నినదిస్తోంది. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగితే, వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని, రాష్ట్ర వినాశనాన్ని సరిచేసేందుకు చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారు. ఆంధ్రుల హక్కుని జగన్ రెడ్డి తనస్వార్థం కోసం అమ్మకానికి పెడితే, అదే హక్కుని కాపాడేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమించారనేది ముమ్మాటికీ వాస్తవం.
అప్పుడైనా… ఇప్పుడైనా….. మరెప్పుడైనా రాష్ట్ర గౌరవాన్ని… హక్కులను కాపాడేది చంద్రబాబునాయుడే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కేవలం ఉనికికోసం, రాజకీయ ప్రాపకం కోసం చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు ఎప్పటికీ నమ్మరు అని మాజీ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. Heading

ఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబే : మాజీమంత్రి ప్రత్తిపాటి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button