మంగళగిరి: ఏఐఐఎంఎస్ లోని క్లినికల్ మైక్రోబయాలజీ, జనరల్ మెడిసిన్ & క్లినికల్ ఫార్మకాలజీ విభాగాలు మరియు సొసైటీ ఫర్ యాంటీమైక్రోబయిల్ స్టీవార్డ్‌షిప్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా (SASPI) సంయుక్తంగా సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు జాతీయ వార్షిక సదస్సు ASPICON 2025 ను ఘనంగా నిర్వహించాయి.
సెప్టెంబర్ 4న ఏఐఐఎంఎస్ మంగళగిరి క్యాంపస్‌లో ఎనిమిది ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్స్, తరువాత సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు విజయవాడలోని హోటల్ నోవోటెల్, వరుణ్ లో “Asserting AMR Awareness” అనే థీమ్ తో ప్రధాన సదస్సు జరిగింది. భారతదేశం ఇంకా అంటురోగాల భారాన్ని భరిస్తూనే ఉంది. వాతావరణ పరిస్థితులు, పారిశుధ్యం పై అపోహలు, ఔషధాల దుర్వినియోగం, OTC లభ్యత వలన యాంటీమైక్రోబయిల్ రెసిస్టెన్స్ (AMR) వేగంగా పెరుగుతోంది. ఇది ఆసుపత్రులు, కమ్యూనిటీల్లో మరణాలు, తీవ్రమైన అనారోగ్యాలు పెరగడానికి కారణమవుతోంది.ఈ సమస్యను ఎదుర్కొనే దిశగా ASPICON 2025 లో 42 పాయింట్ల ఇంటిగ్రేటెడ్ యాంటీమైక్రోబయిల్ స్టీవార్డ్‌షిప్ (IAS) ప్రాక్టీస్ గైడెన్స్ తో కూడిన “ఏఐఐఎంఎస్ మంగళగిరి డిక్లరేషన్” ను ఆవిష్కరించారు. ఈ మార్గదర్శక పత్రం దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు తప్పనిసరి ప్రమాణంగా ఉండేలా Quality Council of India (QCI) తో SASPI కలిసి పని చేయనున్నట్టు ప్రకటించింది.డిక్లరేషన్ ఆవిష్కరించిన వారు : డా. అటుల్ గోయెల్, మాజీ DGHS & ప్రొఫెసర్ ఆఫ్ ఎక్సలెన్స్, LHMC, న్యూ ఢిల్లీప్రొఫెసర్ (డా.) అహంతెం శాంతా సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & CEO, AIIMS మంగళగిరిడా. సరితా మహాపాత్ర, అధ్యక్షురాలు, SASPIడా. సుమిత్ రాయ్, వైస్ ప్రెసిడెంట్, SASPIడా. పి.కె. పాండా, జనరల్ సెక్రటరీ, SASPIడా. దేవబ్రత దాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీడా. డి. రామమోహన్, డీన్, AIIMS మంగళగిరిడా. నటరాజ్, మెడికల్ సూపరింటెండెంట్, AIIMS మంగళగిరిASPICON 2025 ముఖ్యాంశాలు:సెప్టెంబర్ 4న ఏఐఐఎంఎస్ మంగళగిరి లో ఎనిమిది వర్క్‌షాప్స్రాపిడ్ డయగ్నోస్టిక్స్, డిజిటల్ ఆడిట్ ప్లాట్‌ఫారమ్స్, యాంటీమైక్రోబయిల్ ఫార్మాకోకైనెటిక్స్ పై చర్చలుగ్రామీణ ఆసుపత్రుల్లో స్టీవార్డ్‌షిప్ వ్యూహాలుజాతీయ స్థాయి రెసిస్టెన్స్ సర్వైలెన్స్ డేటా ప్రదర్శనలువిద్యార్థుల పోస్టర్ గ్యాలరీలుఆధునిక డయగ్నోస్టిక్ మరియు స్టీవార్డ్‌షిప్ టెక్నాలజీల ప్రదర్శనలుఈ సదస్సులో 400 మంది ప్రతినిధులు, 100 మంది వక్తలు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా AMR పై అవగాహనను చర్యలుగా మలచడానికి ASPICON 2025 ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
1,233 1 minute read