విజయవాడ, ఆగస్ట్ 21, 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్యాశాఖ (Director of Medical Education) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు – ADME (Additional Director of Medical Education)గా విధులు నిర్వహిస్తూ రెండు సంవత్సరాల సేవను పూర్తిచేసిన వారిలో మరొక సంవత్సరం సేవ మిగిలి ఉన్న వారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకడెమిక్ మరియు జనరల్) పదవులకు పదోన్నతికి అర్హులుగా పరిగణించబడుతారని స్పష్టం చేసింది.
ఈ మేరకు 19-08-2025 తేదీన Rc. No. 2937717/E1.A/2025 నంబరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ ఉత్తర్వుల ప్రకారం, ప్యానెల్ ఏడాది 2025-26 కోసం అర్హులైన ADMEల వివరాలను పంపించాలని అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు మరియు ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు.
ఈ ఉత్తర్వులు అత్యవసరంగా పరిగణించాలని డైరెక్టర్ డాక్టర్ డొమmeti సత్య వెంకట లక్ష్మి నరసింహం తెలిపారు.