GUNTUR NEWS: ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు
START INTERMEDIATE EXAMS
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
ఈనెల 17వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా.. ప్రధాన పరీక్షలు 15వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షల కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతోపాటు, రాష్ట్ర కార్యాలయంలోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులు పరిశీలిస్తున్నారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్వ్కాడ్లను ఏర్పాట్లు చేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం
జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 71,528 ప్రథమ, ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందులో
మొదటి సంవత్సరం జనరల్ 34,473 మంది విద్యార్థులు ఉండగా, వృతి విద్య విద్యార్థులు 1,215 మంది ఉన్నారు. అదేవిధంగా
ద్వితీయ సంవత్సరం
34,973 మంది, వృతి విద్య
867 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.