పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు… సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని మాజీ మంత్రి, ఏపీ డబ్ల్యూసీఎఫ్‌సీ ఛైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. 2.42 కోట్ల మంది మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటివరకు 10 కోట్ల మంది మహిళలు, విద్యార్థినులు ఉచిత బస్సులో ప్రయాణించారు. ఇప్పటివరకు రూ.400 కోట్లకుపైగా వారికి ఆదా అయింది. ప్రతి ఇంటికి స్త్రీ శక్తి పథకం ద్వారా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
1,004 Less than a minute