10 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు. AISF గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కొనసాగిస్తామని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫణీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా నాసర్ జీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని .పీపీపీ విధానం వైద్య కళాశాలల్లో అమలు చేయడం వలన కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులకు ఎంబిబిఎస్ విద్య దూరమౌతుంది. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు 14 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసారని. అయితే రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవోలను తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలలో 50% ఎంబిబిఎస్ సీట్లను బి, సి క్యాటగిరీలుగా విభజించి బి కేటగిరీ 12 లక్షలకు, సి క్యాటగిరి 25 లక్షలకు అమ్ముకోవడం వలన అనేకమంది పేద మెరిట్ విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 107, 108 లను 100 రోజుల్లో రద్దు చేసి ప్రతి మెడికల్ కళాశాలను 100% ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిపిపి విధానాన్ని తీసుకువచ్చి ఈరోజు ఆ వైద్య కళాశాలలను కార్పొరేట్లకు అప్పజెప్తున్నారు. AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫణీంద్ర మాట్లాడుతూ ఈ విధానం వలన ఈ రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుంది. దీనివల్ల కేవలం నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదు, ప్రభుత్వ కళాశాలలు ఏర్పడితే కొన్ని వందల పడకలతో కూడిన ఆసుపత్రి కూడా ఏర్పడిద్ది. అనేకమంది పేద వర్గాల ప్రజలకు కూడా ఉచిత వైద్యానికి దూరమవుతారు.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో కొనసాగిస్తామని వెల్లడించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జి.ఓ నెం 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కావున ఈ అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని తీసుకొని ఎడల కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్య పరిచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, నగర నాయకులు అజయ్, దుర్గా ప్రసాద్, సాయి గణేష్, పవన్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
231 1 minute read