గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్‌లో రోడ్లు, డ్రెయిన్‌లు, కల్వర్టుల నిర్మాణం కోసం రూ.1.80 కోట్ల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎన్డీయే కూటమి నేతలు, కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ….25 డివిజన్ నగరానికి శివారుగా ఉండి, చాలా కాలంగా అభివృద్ధి దృష్టికి దూరంగా ఉంది. రోడ్లు, డ్రెయిన్‌లు, నీటి సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు లేని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా లక్ష్మీనగర్ ఏరియాలో తాగునీటి సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు పైపులైన్‌లు వేసి, డ్రెయిన్‌లు నిర్మించి, సీసీ రోడ్లు వేసే పనులకు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ప్రజల సహకారంతోనే సాధ్యమైంది” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం కారణంగా కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ, అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్వాలిటీ మెజర్‌మెంట్స్ సరిగా చేయకపోతే కాంట్రాక్ట్ రద్దు చేయడానికీ, లైసెన్స్ రద్దు చేయడానికీ కూడా వెనుకాడమన్నారు. ప్రజలు ఎక్కడైనా లోపం గమనిస్తే వెంటనే మాకు తెలియజేయాలి — మేము వెంటనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు: లక్ష్మీ నగర్ 1వ లైన్ మరియు క్రాస్ రోడ్ల వద్ద రూ. 50.00 లక్షలతో CC డ్రెయిన్ మరియు RCC కల్వర్టులు నిర్మాణంలక్ష్మీ నగర్ 1వ లైన్ రోడ్లు మరియు 1/6వ లైన్ ఎక్స్‌టెన్షన్ క్రాస్ రోడ్ వద్ద రూ. 50.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణంజోసెఫ్ నగర్, పట్టం సెట్టి కాలనీ క్రాస్ రోడ్ల వద్ద రూ. 80.00 లక్షలతో CC డ్రెయిన్లు, రోడ్లు మరియు RCC కల్వర్టులు*మొత్తం వ్యయం : రూ.1.80 కోట్లు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గాలం వెంకటేశ్వర్లు, కదిరి సంజయ్, బీజేపీ బాబు, తోట చిన్ని, చెంబేటి మణికుమారీ, బాబు, ప్రసాద్ , ఖాజా ఖాన్, వెంకట్రావు, బుల్లబ్బాయి, కోటయ్య,వేణు, పవన్,గుర్రం ప్రసాద్, ఖర్జూర శ్రీనివాస్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
1,001 1 minute read