గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.కళాశాలలో మౌలిక సదుపాయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇంకొన్ని సీఎస్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. సుమారు 2,500 మంది విద్యార్థులు చదువుతున్న ఉమెన్స్ కాలేజీలో, 26 కోర్సులు ఉన్నాయి. అయితే అందుబాటులో ఉన్న క్లాసులే కాకుండా మొత్తం కలిపి 45 క్లాస్ రూములు అవసరం ఉన్నాయి. 12 క్లాసు రూమ్ లను రెండున్నర కోట్లతో నిర్మించే విధంగా సిఎస్ఆర్ నిధులతో కోల్ ఇండియా సంస్థ సహకారంతో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.
230 Less than a minute