chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP LATEST NEWS: గృహిణుల సేవలు వెలకట్టలేనివి..- ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ

AP WOMEN COMMISSION MEETING

ప్రతీ క్షణం జీవితాన్ని తన కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ తాను వెలుగుతూ, కరిగిపోతున్న గృహిణుల త్యాగం కొలవలేమని.. వారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. విజయవాడలోని కేవీఎస్ సిద్ధార్ధ ఫార్మాస్యూటికల్ కళాశాలలో సోమవారం ‘జాతీయ గృహిణుల దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. మార్పు ట్రస్టు, మహిళా స్టడీసెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిక ఈ కార్యక్రమానికి డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గృహిణులు వంటింటికే పరిమితం అనే భావన నుంచి బయటపడి.‌ వారి శ్రమలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా ఉంటూ సమాన అవకాశాలు, హక్కులు కల్పించాలన్నారు. ఇంటి వాతావరణంలో తల్లులు తమ పిల్లల్ని పెంచేటప్పుడు అమ్మాయిలను, అబ్బాయిలను లింగ ఆధారంగా అణిచి వేయరాదని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళల చదువులకు పెద్దపీట వేయాలన్నారు. మహిళల ఆరోగ్యానికి కుటుంబ సభ్యులు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. మహిళల్లో ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి పోషకాహారం లోపం ఎక్కువగా ఉంటుంది అని ఆరోగ్య సర్వే పేర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎక్కువగా వీరికే నష్టం వాటిల్లిందని.. ఇంట్లో తల్లిదండ్రులు, అత్తమామలుల భర్త పిల్లల పోషణలోనే గృహిణుల జీవితం గడిచిపోతుందన్నారు. దీంతో వారి ఆరోగ్యం క్షీణిస్తుందని బాధను వ్యక్తం చేశారు. చదువుకుని, ఉద్యోగం చేస్తున్న గృహిణుల జీవితాల్లో కూడా అణచివేత, హింసా జరుగుతూనే ఉందని, బాలికలు, మహిళలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరల్డ్ కప్ కాంపిటీషన్ లో ఇండియా తరఫున ఆడి గెలిచిన ఉమెన్ క్రికెట్ టీమ్ కు కేక్ కటింగ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్ట్ అధినేత ఆర్. సూయజ్, కళాశాల ప్రిన్సిపాల్ ఎ.సుమతి, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker