గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం భోగి పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే గల్లా మాధవి భోగి మంటలను వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని, గుంటూరు పశ్చిమ నియోజకర్గంలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. నగరానికి పల్లె శోభ సంతరించుకునేలా, సంప్రదాయ దుస్తులు ధరించి, చిన్న పిల్లలకు భోగిపళ్లు వేసి, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించుకోవటం జరిగిందన్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. పిండివంటలు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారని, ఆటపాటలతో ఈ సంక్రాంతి సంబరాలు సాగబోతున్నాయని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో చిరస్థాయిగా ఈ సంబరాలు నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు.
157 Less than a minute