టేబుల్ టెన్సిస్ పతకాలు సాధించిన ఉద్యోగినులకు సిఎస్ అభినందలు
Revised Item..Pl.
ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొన్నరాష్ట్ర సచివాలయ ఉద్యోగులు కాంస్య పతకాలు సాధించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందనలు తెలిపారు.ఈమేరకు కాంస్య పతకాలు సాధించిన మైనార్టీ సంక్షేమ శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న మద్దా బేబి సరోజిని,జిఏడిలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న సహదేవ సత్యవతిలు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వారు సాధించిన కాంస్య పతకాలు, ప్రశంసా పత్రాలను సిఎస్ కు చూపించారు.ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ ఇద్దరు క్రీడా కారులను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
(జారీ చేసినవారు:డైరెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం)