The Successful Paddy Procurement: District Collector Dr. Vinod Kumar V’s 48 Hours Plan for Farmer Welfare||విజయవంతమైన ధాన్యం సేకరణ: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి నేతృత్వంలో రైతు సంక్షేమం కోసం 48 గంటలలో ప్రణాళిక.
ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియపై జిల్లా, మండలం, సచివాలయాల స్థాయి అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
రైతుల పండించిన ధాన్యం సేకరించడానికి అధికారులు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు. వ్యవసాయశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఒక్కొక్కరు 30 ఇళ్లను ఎంపిక చేసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించాలన్నారు. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందనే విషయాలపై రైతులలో చైతన్యం తీసుకురావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కని ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఎన్ని ఎకరాలలో ధాన్యం పంట సాగు చేశారో, ఎంత ధాన్యం ఉత్పత్తి జరుగుతుందో.. ప్రణాళికల రూపొందించుకోవాలన్నారు. ఆర్ ఎస్ కే లకు ఏ రోజు ఎంతమంది రైతులు ధాన్యం విక్రయించడానికి వస్తారో ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. వారి కొరకు 117 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. టార్పాలిన్ పట్టలు, గోనె సంచులు సిద్ధం చేసుకోవాలన్నారు. రైస్ మిల్లులు వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. రైతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కల్టివేట్ యాప్ అమల్లోకి తీసుకురానున్నదని చెప్పారు. సాగు దిగుబడి లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. రైతులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు.
రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం ధాన్యం సేకరణ బృందాలు సిద్ధంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. జిల్లాలో 260 ఆర్ఎస్ కె లు ఉన్నాయని, వాటిలో 117 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 60 తేమ యంత్రాలు సిద్ధంగా ఉంచామని, 73 మిల్లులను ఎంపిక చేశామన్నారు. 13 లక్షల గోనె సంచులు ధాన్యం కొనుగోలుకు సిద్ధం చేశామన్నారు. అవసరమైతే సమకూర్చుకోవాలన్నారు. ధాన్యం తరలించే వాహనాలకు జిపిఎస్ అనుసంధానించాలన్నారు. అక్రమాలకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి అమీర్ బాషా, సంస్థ జిఎం శివపార్వతి, వ్యవసాయ శాఖ డిడి అన్నపూర్ణ, సచివాలయాల కోఆర్డినేటర్ యశ్వంత్, ఆర్ డి ఓ లు, మండల తహసిల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
3 Amazing National Awards Secured by Gopal Rao Award Winner from St. Ann’s College!||సెయింట్ ఆన్స్ కాలేజ్ నుండి Gopal Rao Award విజేతకు దక్కిన 3 అద్భుతమైన జాతీయ స్థాయి పురస్కారాలు!
3 hours ago
Bapatla Gurukulam’s Adhbhuta 110 Crore Transformation: A New Era for Girl’s Education.||విద్యార్థినుల భవిష్యత్తుకు అద్భుత వరం: కోటి 10 లక్షల వ్యయంతో నూతన బాపట్ల గురుకులం భవనం ప్రారంభం!
14 hours ago
Krishna gilla news: చిన్నారుల ముందే అశ్లీల నృత్యం హోంగార్డును సస్పెండ్ చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ