AP NEWS: ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రదానం
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తమ వైద్యులకు అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్. కోవిడ్ సమయంలో సేవలందించిన డాక్టర్లకు హృదయపూర్వక అభినందనలు. ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లకు ఘన నివాళి. డాక్టర్లపై దాడులు చేయడం ఏమాత్రం క్షమార్హం కాదు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణంలో డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. డాక్టర్లను గౌరవించాలి. ఆరోగ్య భారత్, ఆరోగ్యాంధ్రప్రదేశ్ కు డాక్టర్లే ప్రధాన భూమిక పోషించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది కాలంలో ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గత ఐదేళ్లలో పాతుకుపోయిన అవినీతికి అడ్డుకట్టవేశాం. వైద్యారోగ్య శాఖ లో బదిలీల్ని ఎంతో పారదర్శకంగా చేపట్టాం.