నేటి యువత నాటకాలు, కళలను ఆదరించాలి.ప్రత్తిపాటి.
మానవ సంబంధాలు బలహీనమవుతున్నట్టే ,కళా పరిషత్ లు, నాటక పరిషత్ ల పట్ల ప్రజల్లో ఆసక్తి, అదరణ నానాటికీ తగ్గుతున్నాయని, ప్రజాదరణ పెంచేలా కళాకారులు, కళాభిమానులు నేటికీ నాటకాలను ప్రజారంజకంగా కొనసాగించడం నిజంగా అభినందించాల్సిన విషయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం రాత్రి బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా జరిగిన ఎన్.టీ.ఆర్ కళాపరిషత్ నాటక పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చెడు ఆలోచనలను పారద్రోలి, మంచి ఆలోచనలతో సన్మార్గంవైపు నడిపించే శక్తి నాటకః, కళా పరిషత్ లకే ఉందని, నేటి యువత నాటకాలను ఆదరించాలని, కళాకారుల కష్టాన్ని, ప్రతిభను ప్రతిఒక్కరూ గుర్తించాలని పుల్లారావు సూచించారు కళలకు పుట్టినిల్లు చిలకలూరిపేట అని, అలాంటి ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అదే విధంగా త్వరలోనే ఆడిటోరియం పనులు పూర్తిచేస్తామని మాజీ మంత్రి సభాముఖంగా స్పష్టంచేశారు.