chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Bapatla Local News :పేదలకు వరం.. రూ.20కే రాయితీ గోధుమపిండి పంపిణీ-విన్నకోట సురేష్

బాపట్ల: జనవరి 4:-నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.20కే కిలో గోధుమపిండిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని బాపట్ల జనసేన నాయకులు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ పేర్కొన్నారు. ఆదివారం బాపట్ల పట్టణం 19వ వార్డు (కోట్రా వారి వీధి) పరిధిలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు రాయితీ గోధుమపిండిని ఆయన పంపిణీ చేశారు.

Bapatla Local News :పేదలకు వరం.. రూ.20కే రాయితీ గోధుమపిండి పంపిణీ-విన్నకోట సురేష్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతోనే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని ప్రశంసించారు.Bapatla local News మార్కెట్‌లో కిలో గోధుమపిండి రూ.60–65 వరకు ఉండగా, ప్రభుత్వం రూ.20కే అందించడం వల్ల పేదలతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.

ప్రజల ఇబ్బందులను గుర్తించి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఆహార భద్రతను పటిష్టం చేసిన కూటమి ప్రభుత్వం నిజంగా సామాన్యుడి ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు.Bapatla pattanam lo MLA పేదల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే లక్ష్యంగా అఖండ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker