
గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని కమర్షియల్ సంస్థలను సీజ్ చేయడం, నివాసాలకు ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ ఆదేశాల మేరకు మిర్చి యార్డ్, నల్లపాడు రోడ్, శ్యామల నగర్, స్తంభాల గరువు, హనమయ్య నగర్, నల్లచెరువు, ఎల్ఆర్ గాంధీ నగర్, స్వర్ణాంధ్ర నగర్ తదితర ప్రాంతాల్లో కమర్షియల్ సంస్థ సీజ్, ఇతర నివాసాలకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ని రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ సిబ్బంది తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరాభివృద్ధికి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పన్నుల వసూళ్లు కీలకమని, నగరంలోని పన్నుదార్లు సకాలంలో పన్ను చెల్లించి జిఎంసికి సహకరించాలన్నారు. పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఉండే వారికి జిఎంసి నుండి అందించే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజి కనెక్షన్ తొలగించడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తొలగింపు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.








