పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్డా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై ఆయన స్పందించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ నేత. ఆయన అంశం టీడీపీ అంతర్గత వ్యవహారం. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తాం. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే దీన్ని ఏర్పాటు చేశాం. సభ పూర్తయ్యాక పారిశుద్ధ్య బాధ్యత కూడా మేం తీసుకుంటాం. పర్యావరణం గురించి ఏ పార్టీ ఇంతలా ఆలోచించదు” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.