ఎన్‌టిఆర్ జిల్లా :విజయవాడ నగరంలోని లబ్బీపేట రెడ్ సర్కిల్ లోని బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్ష కేంద్రంలో ప్రారంభమైన యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలలో భాగంగా తొలి రోజు శుక్రవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను ప్రశాంతమైన వాతావారణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐదురోజుల పాటు నిర్వహించే మెయిన్స్ పరీక్షలలో నేటి తొలి రోజు పరీక్షకు 106 మంది అభ్యర్థులు గాను 102 మంది హాజరయ్యారన్నారు. విభిన్నప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రంలో చేసిన ఏర్పాట్లును పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణకు 11 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు వెన్యూ సూపర్వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించామని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమై ఏర్పాట్లతో ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి నుండి ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 23,24, తిరిగి 30,31వరకు ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
పరిశీలనలో కలెక్టర్ వెంట లైజన్ అధికారులు బి.రామకృష్ణ నాయక్, సి.లక్ష్మీ నారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ కె.సంధ్య, వైస్ ప్రిన్సిపల్ వి.సునీతఉన్నారు.
………………………………………………………………………………………………..
డిఐపిఆర్వో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారిచే జారీచేయడమైనది.
230 1 minute read