
పశుపోషకులకు 90 శాతం, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీ**గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్*పాడిపరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మినీగోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో శనివారం బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో నిర్మించిన మూడు షెడ్లను, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నిర్మించిన ఒక షెడ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 -19 మధ్య కాలంలో తెలుదేశం ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గన్నవరం విమానంలోపైనే ప్రమాదం తప్పిన ఎయిర్ ఇండియా విమానం||Air India Flight Avoids Major Accident at Gannavaram
కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టిపెట్టి… మినీ గోకులాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందన్నారు . పశుపోషకులకు 90 శాతం, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. దింతో పాడి పరిశ్రమకు మళ్ళీ జీవం వస్తుందని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు క్షీరసాగర విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి కాకాని వెంకట రత్నం కృష్ణాజిల్లా వాసి కావడం గర్వకారణం అన్నారు. వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదల – గన్నవరం రాజకీయాల్లో కొత్త ఉత్కంఠ Vallabhaneni Vamsi Released from Jail — New Twist in Gannavaram Politics
ఆయన హయంలోనే పాలకేంద్రాలు ఏర్పాటయ్యాయని, కృష్ణామిల్క్ యూనియన్ అవిర్భవించిదని యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల యమ్.పి.డి.ఓ సత్యకుమార్, పి.ఆర్ ఎ.ఈ శ్రీనివాసరావు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ సిబ్బంది ఎపిఓ వెన్నెల, ఈ.సి. నాగరాజు, టి.ఎ వినయ్, ఎఫ్.ఎ రవి, బాపులపాడు మండల ఎమ్.పి.డి.ఓ జోగేశ్వరరావు, ఎపిఓ అశోక్ కుమార్, పి.ఆర్.ఎఈ డి.జయరాజు, ఈసి నాగరాజు, టి.ఎ జగదీష్ …. నాయకులు చిరుమామిళ్ళ సూర్యనారాయణ ప్రసాద్ (సూర్యం), దయాల రాజేశ్వరరావు, గుండపనేని ఉమా వరప్రసాద్, మూల్పూరి సాయి కళ్యాణి, అట్లూరి రామ్ కిరణ్, సూరెడ్డి బెనర్జీ, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, మేడేపల్లి రమ, మోదుగుమూడి సత్యనారాయణ, వేగిరెడ్డి పాపారావు, పుట్టా సురేష్, తాతినేని సృజన్ బాబు, నాగరాజు, కొండేటి వెంకటేశ్వరరావు, కుందేటి చంద్రశేఖర్, బోడపాటి రవికుమార్, చలసాని శ్రీనివాసరావు, కలపాల సూర్యనారాయణ, మొవ్వ వెంకటేశ్వరరావు, మాదాల శ్రీనివాసరావు, కొమ్మారెడ్డి రాజేష్, నక్కా ప్రసాద్, మొవ్వ వేణుగోపాల్, కొండపల్లి వెంకటేశ్వరరావు, యనమదల శ్రీనివాసరావు, కొల్లూరి చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.








