బాపట్ల
Trending

బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.

విద్యతోనే మహిళలు అభివృద్ధి సాధిస్తారని గుర్తించిన గొప్ప మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు.

       మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమం శుక్రవారం స్థానిక బాపట్లలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా అధికారులు పలువురు పుష్పమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. 

      మహాత్మా జ్యోతిరావు పూలే త్యాగాలు మరువలేనివని పార్లమెంట్ సభ్యులు చెప్పారు. మహిళలకు విద్య అవసరం లేదని చిన్నచూపు చూసే బ్రిటిష్ పరిపాలనలో మహిళల కొరకు పూలే పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే కి చదువు చెప్పి ఆమె ద్వారా తన ఇంటి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. మహారాష్ట్రలోని తన ఇంట్లో ప్రారంభమైన ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించిందని తెలిపారు. అక్షరాస్యతతోనే మహిళల అభ్యున్నతి సాధించగలరని గుర్తించి అనేక పాఠశాలలను ప్రారంభించారన్నారు. ఆనాటి ఉద్యమం సత్ఫలితాలనివ్వగా, నేడు అన్ని రంగాలలో మహిళలు పోటీ పడడం సంతోషదాయకమన్నారు. ఏప్రిల్ నెలలోనే మహనీయుల పుట్టినరోజులను ప్రభుత్వం అధికారికంగా జరపడం అభినందనీయమన్నారు.

      మహిళల సాధికారత కొరకు 150 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే భారత్ లో ఉద్యమాలు ప్రారంభించిన తొలి యోధుడని జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. బీసీల ఆరాధ్య దైవంగా మహాత్మా పూలే జ్యోతిరావుపూలే చరిత్రలో నిలిచిపోయారని ప్రశంసించారు. భర్త చనిపోగానే చితిలోనే మహిళలను కాల్చివేయడం వంటి సాంఘిక దురాచారాలను నిషేధించిన గొప్ప నాయకుడని  అభినందించారు. బాల్య వివాహాలు, అంటరానితనం, మహిళలకు విద్య, రిజర్వేషన్లపై పోరాటాలు చేసిన గొప్ప యోధుడన్నారు. మహిళలకు విద్య అందించడానికి తమ సంపాదన మొత్తాన్ని సమాజం కొరకు ఖర్చు చేసిన గొప్ప మహనీయులని వివరించారు.

    మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి స్ఫూర్తిదాయకుడని బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, స్త్రీకి సమానత్వం రావాలని పోరాడిన గొప్ప సామాజిక నాయకులుగా పూలే నిలిచారన్నారు. మహాత్ముల పుణ్యఫలమే వెనకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని ఆయన చెప్పారు.

      ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటి చైర్మన్ శలగాల రాజశేఖర్ బాబు, జిల్లా రెవిన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, ఆర్డీవో పి గ్లోరియా, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారని రాజా దెబోరా, బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు మోహన్ గౌడ్, చారువాక, తదితరులు పాల్గొన్నారు.

(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker