GUNTUR NEWS: శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి కోసం జేఏసీ చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు
OVER BRIDGE CONSTRUCTION MEETING
గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి ఉద్యమం ఉదృతం అవుతోంది. ఈమేరకు
ఓవర్ బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, భారవి, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ 98 కోట్లతో చేపట్టే ఓవర్ బ్రిడ్జి విస్తరణ వల్ల ప్రయోజనాలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. గతంలో ఎంతోమంది ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యరూపం దాల్చే విధంగా కృషి చేశారని అభినందించారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి కోసం జేఏసీ చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా లక్ష్మణరావు, మస్తాన్ వలీ మాట్లాడుతూ ఆర్.యూ.బీ నిర్మించకుండా ఆర్.ఓ.బీ నిర్మిస్తే భవిష్యత్తులో నష్టం జరిగిందని చెప్పారు. సేతుబంధు పధకంలో ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేయాలని అనుకోవడం లోనే సమస్య ఆరంభమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా నిధులు సమీకరించి ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదన చేసిన విధంగా 160 కోట్లతో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని సూచించారు.