ఆంధ్రప్రదేశ్
యోగాసనాలతో ఆకట్టుకున్న స్వాతంత్ర సమరయోధుడు చుంచు. సూర్యనారాయణ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు చుంచు. సూర్య నారాయణ 97 ఏళ్ల వయ సులో యోగాసనాలను వేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నా రు.పాఠశాల విద్యార్థులతో కలసి 97 సంవత్సరాలు వయసులో యోగాసనాలను వేయటం అనేది అందరికీ సాధ్యం కాదని పలువురు ఆశ్చర్యానికి గురై ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడు తూ యోగాసనాల వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ తప్పక యోగాసనాలను అభ్య సించి ప్రతిరోజు దిన చర్యగా అలవర్చుకోవటం వలన మంచి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పలు రకాల వ్యాధులను దరి చేర కుండా నివారించవచ్చునని ఆయన తెలియజేశారు.