ఆంధ్రప్రదేశ్
AP POLITICAL: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసిన కర్ణాటక నందీపుర పీఠాధిపతులు
KARNATAKA SWAMIJI MEET WITH Y S JAGAN
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ కు పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ, పంచాక్షరి శివాచార్య స్వామీజీ, జడేశ్వర తాత, శ్రీ కృష్ణపాద స్వామీజీ, ఆహ్వానపత్రిక అందజేశారు.