
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పలు ఆలయాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రాకతో అమ్మవారి ఆలయాలు కళకళలాడాయి. కుటుంబ సమేతంగా భక్తులు హాజరై దైవదర్శనం గావించారు. సకల శుభాలు కలగాలని దుర్గమ్మను వేడుకున్నారు.







