Trending

శుక్రుడు 3 మార్పులు – 5 రాశులకు అదృష్ట దశ! Shukra Changes in July – Luck Shines on These 5 Signs!

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు ఒక శక్తివంతమైన గ్రహం. ఇది ప్రేమ, ఆర్ధికం, వైవాహిక జీవితం, సౌందర్యం మరియు సామాజిక సంబంధాలపై ప్రభావాన్ని చూపుతుంది. జూలై 2025లో శుక్రుడు మూడు కీలకమైన మార్పులు చేయబోతున్నాడు – జూలై 8న రోహిణి నక్షత్రంలోకి, జూలై 20న మృగశిర నక్షత్రంలోకి, ఆపై జూలై 26న మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుల ప్రభావం కొన్ని రాశులపై శుభప్రదంగా ఉండబోతోంది.

మిథునం వారికి శుక్రుని మార్పులు ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగొచ్చు. భూమి, వాహనాల కొనుగోలు అవకాశాలు కనిపిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది.

తుల రాశి వారికి ఈ కాలం మంచి సమయంగా ఉంటుంది. పని ప్రదేశంలో గుర్తింపు, పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఆర్థికంగా లాభపడతారు. ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి.

ధనుస్సు వారికి వివాహ బంధంలో బలమైన మార్పులు కనిపిస్తాయి. పాత పెట్టుబడుల నుంచి ఆశ్చర్యకర లాభాలు వస్తాయి. నటన, మీడియా, జర్నలిజం చదువుతున్న వారికి ఈ సమయం శుభప్రదం.

సింహం వారికి ఈ శుక్ర దశ ఆదాయంలో పెద్దగా మార్పు తీసుకురాగలదు. ప్రతిభకు గుర్తింపు, పెట్టుబడులలో లాభం, ప్రేమ జీవితంలో ప్రశాంతత ఈ సమయంలో కనిపిస్తాయి.

కుంభం వారికి ఆస్తి, ఇల్లు, వాహనాలకు సంబంధించి శుభపలితాలు కనిపిస్తాయి. బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి. మానసికంగా సంతృప్తిని అనుభవించగలరు.

ఈ శుక్ర మార్పులు కొన్ని రాశుల వ్యక్తిగత జీవితానికి కొత్త ఉత్సాహాన్ని, ఆర్థిక జీవితానికి కొత్త వెలుగును తీసుకురానున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే, ఈ మార్పులు జీవితం లో సానుకూల దిశగా ముందుకు నడిపించగలవు.

Authors

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker