ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్

MLC ELECTION UPDATE

కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ. వెంకటేశ్వరావు, గోపి మూ,ర్తి బాలసుబ్రమణ్యం, ఇతర ప్రజా కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుబద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో సుదీర్ఘ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button