ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లుకి సత్కార కార్యక్రమం జరిగింది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో జరిగిన ఇది సన్మాన సభ కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. సన్మానం అంటే కేవలం సత్కారం మాత్రమే కాదు బాధ్యత అని మరచిపోకూడదు. మీ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుని చిన్న చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాలు సమన్వయం చేసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గురించి వివరిస్తూ అవసరమైతే ఎమ్మెల్యే దృష్టికి లేదా నా దృష్టికి తీసుకువస్తే మీకు సరైన సమయంలో సరైన అవకాశం అందించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్, గల్లా మాధవి, కన్నా లక్ష్మీనారాయణ, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, క్రేన్ సంస్థ అధినేత గ్రంధి కాంతారావు, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, పోతురాజు సమత, తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తూరు వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
229 1 minute read