
శంకర్ విలాస్ ఆర్.ఓ.బి పియర్స్ (పిల్లర్స్) నిర్మాణం కోసం తవ్విన మట్టిని ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని నగర కమిషనర్ ఆర్ అండ్ బి ఇంజీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఆర్.ఓ.బి పనులను అధికారులతో కలిసి తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మాణ ప్రాంతాన్ని తనిఖీ చేసి, సదరు ప్రాంతంలో పియర్స్ (పిల్లర్స్) నిర్మాణం కొరకు తవ్విన మట్టి ఉండుట చూసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యుద్ద ప్రాతిపదికన తొలగించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అంతేకాక సర్వీస్ రోడ్డులో కూడా ఎటువంటి మట్టి లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ తొలగించాలన్నారు. ఆర్.ఓ.బి నిర్మాణం కొరకు మొత్తం 21 పియర్స్ (పిల్లర్స్) నిర్మాల్సి ఉండగా ఇప్పటికే సదరు ప్రాంతంలో శంకర్ విలాస్ వైపు 3 మరియు జి.జి.హెచ్ వైపు 3 పియర్స్(పిల్లర్స్) నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. వీటిలో 13 డబల్, 6 సింగల్ పియర్స్ (పిల్లర్స్) మరియు 2 పియర్స్(పిల్లర్స్) ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ వారు నిర్మించడం జరుగుతుందని ఆర్ అండ్ బి అధికారులు తెలిపారన్నారు. ఆర్.ఓ.బి నిర్మాణంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత చర్యలు తీసుకుంటూ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎ.సి.పి రెహమాన్, ఆర్ అండ్ బి డి.ఈ.ఈ చెన్నయ్య, జె.ఈ.ఈ సాయి కృష్ణ, సైట్ ఇంజనీర్ సుధీర్, అధకారులు సిబ్బంది పాల్గొన్నారు.








