
చీరాల:-సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి, చీరాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ను సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచిందని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణా రావు, కరస్పాండెంట్ యస్. లక్ష్మణ రావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.

కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న యు. పావని ప్రియ ఇటీవల రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో ప్రతిభ చూపి ఈ ప్రతిష్ఠాత్మక స్కాలర్‌షిప్‌ను కైవసం చేసుకుందని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. యస్.వి.డి. అనిల్ కుమార్ తెలిపారు.
ఈ స్కాలర్‌షిప్ కింద విద్యార్థినికి సంవత్సరానికి రూ.50,000 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సహాయం రిలయన్స్ ఫౌండేషన్ అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఫస్ట్ ఇయర్ ఇన్‌చార్జ్ యస్. అమరనాధ్ బాబు, ఈసీఈ విభాగాధిపతి డా. డి. రాజేంద్ర ప్రసాద్, డా. రు. రత్నరాజు, పి. అనిల్ కుమార్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని యు. పావని ప్రియను ఘనంగా అభినందించారు.Bapatla Local News
జాతీయ స్థాయిలో ఈ స్కాలర్‌షిప్‌ను సాధించడం కళాశాల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ప్రిన్సిపాల్ డా. యస్.వి.డి. అనిల్ కుమార్ పేర్కొన్నారు.










