
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతలపూడి యందు కామ్రేడ్ వై తారక్ నాధ్ గారి 21 వ వర్ధంతి సందర్భంగా చింతల పూడి మెయిన్ ఎస్బిఐ బ్రాంచ్ మరియు ఫైర్ స్టేషన్ ఎస్బిఐ బ్రాంచ్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో మా కళాశాలకు నాలుగు సీలింగ్ ఫ్యాన్ లను బహుకరించడం జరిగినది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. పి. శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పేద విద్యార్థిని, విద్యార్థులు చదువుకునే కళాశాలకు ఇటువంటి వితరణ ఇవ్వడం మీయొక్క మానవీయ విలువలకు నిదర్శనం అని ఇలాంటి సహాయ సహకారములు మరికొన్ని మా కళాశాలకు ఇలా కొనసాగించాలని వారిని అభినందించడం జరిగినది ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యపకేతర మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్టేట్ బ్యాంక్ సిబ్బంది వారిని ప్రశంసించుట జరిగినది.








