
Hyderabad:20-11-25-లకిడికపూల్‌లోని సదరన్ ట్రావెల్స్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ టూరిజం సంస్థ సదరన్ ట్రావెల్స్ దేశీయ, అంతర్జాతీయంగా 2,500 కస్టమైజ్డ్ గ్రూప్ ప్యాకేజీలను ప్రారంభించినట్లు ఎండి కృష్ణ మోహన ఆలపాటి ప్రకటించారు.అంతర్జాతీయ విభాగంలో యూరప్, జపాన్ చెర్రీ బ్లోసమ్, ఆఫ్రికా, స్కాండినేవియా, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా, ఫార్ ఈస్ట్ ఆసియా టూర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదే తరహాలో దేశీయంగా రాజస్థాన్, కేరళ, అండమాన్, చార్ ధామ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, నార్త్ ఈస్ట్, తమిళనాడు, మేఘాలయ, గుజరాత్ వంటి ప్రముఖ పర్యాటక గమ్యస్థానాలకు కొత్త టూర్ ప్యాకేజీలు విడుదల చేసినట్లు వివరించారు.

గత సంవత్సరం నిర్వహించిన “మహా ధమాకా లక్కీ డ్రా 2024” ఫలితాలను త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే “మహా ధమాకా లక్కీ డ్రా 2025” ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఈ డ్రాలో పాల్గొనేవారికి కొత్త కారు సహా 25కిపైగా ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌లో టూర్స్, ప్యాకేజీల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.







