
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం, వేములూరిపాడు గ్రామానికి చెందిన ప్రత్యూష తెలిపిన వివరాల ప్రకారం— WATCH ON LIVE
గర్భధారణ సమయంలో ఆమె ప్రతి రోజు సాధారణ ఫాలోఅప్ కోసం స్థానిక వైద్యులను సంప్రదిస్తూ వచ్చింది. అయితే ఐదో నెలలో, అనంతరం ఏడో నెలలో కూడా నిరంతర బ్లీడింగ్ ఆగకపోవడంతో పరిస్థితి క్లిష్టమైంది. గుంటూరు ప్రాంతంలోని పలువురు డాక్టర్లను సంప్రదించినప్పుడు, శిశువులో లోపాలు ఉన్నాయని, గర్భాన్ని కొనసాగించడం కష్టమని కొందరు సూచించారు. మరో ప్రముఖ వైద్యుడు కూడా “బిడ్డ బతకడం కష్టం” అని చెప్పడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
నిరంతర బ్లీడింగ్ ఆగకపోవడం, ఇతర ఆసుపత్రుల్లో అభిప్రాయం అనుకూలంగా లేకపోవడంతో చివరికి అబార్షన్ వైపు నిర్ణయం తీసుకునే స్థితి వచ్చింది. అదే సమయంలో అస్టర్ రమేష్ హాస్పిటల్‌లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 15 వరకు విజయవంతంగా నిర్వహించారని తెలిసి ఆసుపత్రిని సంప్రదించింది. వైద్య బృందం రిస్క్‌లు స్పష్టంగా వివరించడంతో పాటు, చికిత్సపై ధైర్యం ఇవ్వడంతో ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడి ఆసుపత్రిలో చేరింది.
మొత్తం 127 రోజుల పాటు చికిత్స కొనసాగింది. అనంతరం జరిగిన డెలివరీలో శిశువు 700 గ్రాముల బరువుతో పుట్టాడు. నిరంతర NICU సంరక్షణ, అనేక విభాగాల సమన్వయంతో శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగై, ప్రస్తుతం ఏ విధమైన లోపాలు లేకుండా 2.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడు.
తన అనుభవాన్ని పంచుకుంటూ ప్రత్యేషు ఇలా పేర్కొంది—
“అంత చిన్న బరువుతో పుట్టిన నా బిడ్డను ఇంత జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద బృందం కృషి. ప్రతి విభాగం తమ వంతు పనిచేసింది. అస్టర్ రమేష్ హాస్పిటల్‌కి రావడం మా అదృష్టం. బిడ్డకు ప్రాణం పోసిన ఈ బృందానికి మరియు ఆసుపత్రి నిర్వాహకులకు కృతజ్ఞతలు.”
డాక్టర్ రాయపాటి మమతా (డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హాస్పిటల్ తరఫున)
“ఈ కేసు అరుదైనది. 24×7 పనిచేసే ప్రీమియం-లెవల్ NICU, హై ఎండ్ వెంటిలేషన్, ప్రత్యేక ప్రోటోకాల్స్—ఇలాంటి సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లోనే 700 గ్రాముల ప్రీమెచ్యూర్ శిశువులు రికవరీ అవుతారు. హై రిస్క్ న్యూబోర్న్స్ సంరక్షణలో మేము రాష్ట్రస్థాయిలో ప్రత్యేకస్థానంలో ఉన్నాం.”
డా. అనిత చాగంటి (సీనియర్ నియోనేటాలజిస్ట్ – నియోనేటాలజీ విభాగం తరఫున)“24 వారాల శిశువు అంటే శ్వాసకోశం, గుండె, మెదడు, కంటి అభివృద్ధి పూర్తికాకుండా పుట్టడం. పుట్టిన వెంటనే రెస్పిరేటరీ డిస్ట్రెస్, BPD లాంటి పరిస్థితులను సమయానికి అడ్డుకోవడం కీలకం. అధునాతన వెంటిలేషన్, నిరంతర మానిటరింగ్ వల్ల బిడ్డను స్టేబిలైజ్ చేయగలిగాం.”
డా. మహేష్ చౌదరి అతోట (నియోనేటాలజీ – విభాగం సహ బాధ్యత)
“700 గ్రాముల శిశువును కాపాడటం ప్రతి నిమిషం పోరాటం. శిశువు ఉష్ణోగ్రత, ఆక్సిజన్, ఇన్ఫెక్షన్ నియంత్రణ— ఇవన్నీ కఠినంగా నిర్వహించాలి. NICU నర్సింగ్, టెక్నికల్ టీమ్ సమన్వయం ఈ విజయానికి కారణం. రాష్ట్రంలో ఇలాంటి హై రిస్క్ న్యూబోర్న్ ట్రీట్‌మెంట్ సమర్థవంతంగా చేసే యూనిట్స్‌లో ఇది ప్రముఖం.”
డా. జ్యోతి ప్రకాశ్ రెడ్డి (పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ – కార్డియాలజీ విభాగం తరఫున)“శిశువులో PDA మూసుకోకపోవడం = అత్యవసర పరిస్థితి. 700 గ్రాముల బిడ్డపై ఇలాంటి చికిత్సకు అత్యుత్తమ అక్కురసీ అవసరం. కార్డియాలజీ టీమ్ సమయానికి నిర్ణయం తీసుకుని PDAని నియంత్రించింది. ఇలాంటి మైక్రో-లెవల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్ చేయగల వ్యవస్థ ఈ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంది.”
డా. లోగన్నాధన్ (ROP Laser Specialist – ఆఫ్తల్మాలజీ విభాగం తరఫున)
“ప్రీమెచ్యూర్ బిడ్డలలో ROP ఎక్కువ ప్రమాదకరం. ఈ శిశువులో మార్పులను మొదటి దశలోనే గుర్తించి వెంటనే లేజర్ చికిత్స చేసినందువల్ల చూపు కాపాడగలిగాం. సమయస్పూర్తి, సమన్వయం చికిత్స ఫలితాన్ని ఇచ్చాయి.”
డా. అనురాధ మంచికంటి (హై రిస్క్ గైనకాలజీ – OBG విభాగం తరఫున)
“తల్లిలో నిరంతర బ్లీడింగ్ ఉన్నప్పటికీ తల్లి–శిశువు ప్రాణాలు కాపాడే రీతిలో డెలివరీ చేయడం ప్రధాన సవాలు. బర్త్ అండ్ బియాండ్ యూనిట్ సమన్వయంతో సురక్షితంగా నిర్వహించగలిగాం.”
డా. వసంత – డా. భాను తేజా (OBG టీమ్ తరఫున)“హై రిస్క్ ప్రెగ్నెన్సీలో తల్లి స్థితి క్షణక్షణం మారుతుంది. డెలివరీ ప్లానింగ్, అత్యవసర నిర్ణయాలు, NICUతో సమన్వయం—ఈ మూడు కారణాల వల్ల శిశువు సురక్షితంగా పుట్టాడు.”
డా. తన్వీర్ బెగం – డా. అపూర్వ (పెడియాట్రిషియన్లు – పెడియాట్రిక్ విభాగం తరఫున)“NICU నుండి బయటకి వచ్చిన తర్వాత బరువు పెరుగుదల, అవయవాల అభివృద్ధి, ఇన్ఫెక్షన్ నివారణ— ఇవన్నీ క్రమం తప్పని ఫాలోఅప్‌లో భాగం. ఇలాంటి ప్రీమెచ్యూర్ శిశువులకు ప్రత్యేక ఫాలోఅప్ క్లినిక్ అవసరం. ఆ సౌకర్యం ఈ హాస్పిటల్‌లో ఉంది.”
డా. భరత్ సిద్ధార్థ (పెడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ – కార్డియాక్ సర్జరీ విభాగం తరఫున)“ఇలాంటి బరువు, వయస్సు గల శిశువులకు గుండె శస్త్రచికిత్స అవసరమైతే ప్రత్యేక పరికరాలు, మైక్రో-సర్జరీ నైపుణ్యం తప్పనిసరి. గుంటూరులో ఈ స్థాయి పరికరాలు, శస్త్రచికిత్స సౌకర్యం ఈ ఆసుపత్రిలోనే లభిస్తుంది.”
700 గ్రాముల శిశువుకు అనస్తీషియా ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. సూక్ష్మంగా డోసింగ్, ఉష్ణోగ్రత నియంత్రణ, వెంటిలేషన్ నిర్వహణ—ఇవి ప్రత్యేక నైపుణ్యం కోరే అంశాలు. NICU–కార్డియాక్ టీమ్ కలిసి పనిచేయడం వల్లే సురక్షిత ఫలితం వచ్చింది.” ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం తో పాటు అనుబందవిభాగాల సిబ్బంది పాల్గొన్నారు








