
చిలకలూరిపేట:
మొంథా తుఫాన్ ప్రభావంతో చిలకలూరిపేట పట్టణంలోని అనేక ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో, మాజీ మంత్రివర్యులు విడదల రజిని గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. సంజీవనగర్, తండ్రి సన్నిధి, సుగాలి కాలనీ, వీరముష్టి కాలనీ, గణపవరం శాంతినగర్, పసుమర్రు ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విచారించారు. Chilakaluripeta news:అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో భాగంగా భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హై స్కూల్, చిలకలూరిపేట విద్యార్థుల యోగాభ్యాసనాలు.

పర్యటనలో రజిని బాధితులకు ఆహారం మరియు తాగునీరు అందజేయడంతో పాటు, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిలకలూరిపేటలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని పేర్కొన్నారు.

అలాగే చిలకలూరిపేటను వరద ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి, భారీ నష్టం ఎదుర్కొన్న పేద కుటుంబాలకు తక్షణం ₹10,000 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా ఇళ్లలోకి నీరు చొచ్చుకుపోవడం, విద్యుత్, తాగునీటి సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉపశమనం చర్యలు చేపట్టి, బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.







