
రేపు ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో దినంను పురస్కరించుకుని, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గౌరవ శాసనసభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
పోలియో రహిత సమాజం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి పిల్లలు పోలియో చుక్కలు మిస్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా
ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీ కేంద్రాలు, అలాగే రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉంటారని చెప్పారు.Narasaraopet MLA Dr. Chadalawada Aravinda Babu
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలను దగ్గరలోని పోలియో కేంద్రాలకు తీసుకువెళ్లి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి అని శాసనసభ్యులు పిలుపునిచ్చారు. చిన్నపాటి చుక్కలతో పిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చని, ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు.
పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌరవ శాసనసభ్యులు ప్రజలను కోరారు.







