
కృష్ణాజిల్లా:గుడివాడ వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మున్సిప ల్ మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ అడపా బాబ్జి 57వ జయంతి వేడుకలను వైసిపి యువజన విభాగ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ,మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు అడబాల అప్పారావు,మట్టా జాన్ విక్టర్ అద్దెపల్లి పురుషోత్తం, తదితరలు పూలమాలలతో నివాళుర్పించి కేక్ కట్ చేశారు
వారుమాట్లాడుతూ
నిబద్ధతగల రాజకీయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాబ్జి ప్రజల మన్ననలతో వివిధ ప్రాంతాల్లో ఓటమనేదే లేకుండా విజయాలుసాధించి, మున్సిపల్ కౌన్సిల్లో ప్రజల పక్షాన గళంవినిపించిన రాజకీయధీరుడని కొనియాడా రు.భౌతికంగా మనమధ్య లేకపోయినా చేసిన మంచి పనుల ద్వారా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచా రన్నారు.ఈ కార్యక్రమంలో గంటా శ్రీను,షేక్ బాజీ,ఎం.వి నారాయణరెడ్డి,జ్యోతుల సత్యవేణి ఆంజనేయ ప్రసాద్,వెంపటి సైమన్, రెమల్లి నీలాకాంత్,,అడపా పండు, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.







