
బాపట్ల:డిసెంబర్:- 13, 14 తేదీల్లో (శనివారం, ఆదివారం) బాపట్ల అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 7వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్లో చెరువు జమ్ములపాలెం గ్రామానికి చెందిన మేకల ఆనందరావు (65) అసాధారణ ప్రతిభను కనబరిచి పలు పతకాలు సాధించారు.
ఈ పోటీల్లో
- 5 కిలోమీటర్ల నడకలో బంగారు పతకం,
- 100 మీటర్ల పరుగు లో బంగారు పతకం,
- 800 మీటర్ల పరుగు లో వెండి పతకం,
- 4×100 మీటర్ల రిలే పరుగు లో వెండి పతకం
సాధించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.Bapatla local news :బిడారుదిబ్బలో సెమా క్రిస్మస్ వేడుకలు ఘనంగా
65 ఏళ్ల వయసులోనూ క్రీడా రంగంలో ఈ స్థాయి ప్రదర్శన చేయడం ఎంతో గర్వకారణమని తోటి స్నేహితులు, చెరువు జమ్ములపాలెం గ్రామవాసులు అభినందనలు తెలిపారు. ఆయన విజయంతో గ్రామ ప్రజలతో పాటు బాపట్ల పట్టణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వయస్సు ఆటంకం కాదని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిన మేకల ఆనందరావును పలువురు ప్రముఖులు అభినందించారు.







