బార్బడోస్: ఆంధ్రప్రదేశ్;Amaravathi:- శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పత్రుడు గారు, బార్బడోస్ నేషనల్ హౌస్ ఆఫ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ ఆర్థర్ హోల్డర్‌ను సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బార్బడోస్ అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చిందని శ్రీ అయ్యన్న పత్రుడు ప్రశంసించారు.
ఈ సందర్బంగా, పార్లమెంటరీ విలువలు, ప్రాతినిధ్య వ్యవస్థలో పారదర్శకత, ప్రజల ప్రాధాన్యత వంటి అంశాలపై ఇద్దరు స్పీకర్లు అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశం సానుకూల వాతావరణంలో జరిగింది.