
ఏలూరు:ధర్మాజీగూడెం:03-11-25:-లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నవంబర్ 9వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న దళిత ఐక్యవేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు తాడేపల్లి దాసుబాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ —జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ నమ్మబలికిన దళితుల ఓటు బ్యాంకింగ్ తో అధికారంలోకి వచ్చి, అనంతరం దళితులపై దమనకాండ సృష్టించారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులపై అక్రమ కేసులు, దళిత మహిళలపై అత్యాచారాలు, యువతపై హత్యాయత్నాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉన్నదని ఆరోపించారు.
ఇలాంటి పరిస్థితులను చూసి రాష్ట్ర దళితులు యూటర్న్ తీసుకున్నారని, సుపరిపాలన సాధ్యమవ్వాలంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని విశ్వాసంతో కూటమికి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉందని, సూపర్ సిక్స్ పాలనతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో లింగపాలెం మండల స్థాయిలో “దళిత ఐక్యవేదిక”ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో దళితులు, మహిళలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు కొత్తూరు నాగమణి, ఏఎంసీ డైరెక్టర్ మాదాసు కృష్ణ, మండల జనసేన అధ్యక్షులు పంది మహేష్, బిజెపి కార్యవర్గ సభ్యులు శ్రీకాకొల్లు వెంకట నాగేశ్వరరావు, తొమ్మాండ్రు మల్లయ్య, మేడూరి జయరాజు, పొదిలి శౌరి, భూపతి సాంబశివరావు, వేల్పుల దాసు, పొదిలి జేమ్స్, గాలంకి కుటుంబరావు, పెద్దిరాజు, తనగాల యోహాను, రాములు, పరసా రాజేశ్వరరావు, అనీష్, రాచూరి రాజారత్నం తదితరులు ల్గొన్నారు.స్లోగన్‌గా:
“మన రోషన్ – మన చింతలపూడి, మన మహేష్ – మన ఏలూరు పార్లమెంట్… రండి కదలిరండి, పండగ చేసుకుందాం… 9న జరిగే దళిత ఐక్యవేదిక కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం!”
 
 






