నియోజకవర్గం లోని కొండలరావు పాలెం గ్రామంలో ఈనెల నాలుగో తేదీన వైయస్సార్సీపి నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు రావడంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి అవ్వకులు చవాకులు మాట్లాడుతున్నారని దెందులూరు నియోజకవర్గం వైసీపీ నాయకులు విమర్శించారు. ఏలూరులోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో దెందులూరు వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసీపీ నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడంతో తట్టుకోలేని టిడిపి వర్గం ఆక్రోషంతో మాజీ శాసనసభ్యులు నిందారోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కామరెడ్డి నాని, ముంగర సంజీవ కుమార్, ఏరా ఆనంద్, అప్పన వీడు అప్పన ప్రసాద్, జానంపేట బాబు, ప్రభాకర్ రావు, శ్రీపర్ కొండ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు
265 Less than a minute