ఏలూరుఆంధ్రప్రదేశ్
Eluru District Collector Selvi has instructed officials to thoroughly examine the petitions received from the public at the public grievance redressal platform and resolve them expeditiously.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అర్జీల పరిష్కారంలో అర్జీదారని సంతృప్తి ధ్యేయం అని అన్నారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో 391 అర్జీలు వివిధ సమస్యలపై ప్రజలు అందజేశారు. వచ్చిన అర్జీలు స్వీకరించి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలనే సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.