ఒక 50 ఏళ్ల మహిళ.. భర్త, కుమారుడు చనిపోయాక ఒంటరిగా జీవితం గడుపుతుంటే, జీవితం చివరలో సరైన తోడు కావాలని భావించింది. కానీ అదే ఆమె జీవితంలో చీకటి రోజులు తెచ్చింది.
చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజ్‌పేట్‌కు చెందిన నాగమణి.. భర్త వెంకటప్ప రెడ్డి, కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో, తనకు తోడు కావాలని నిర్ణయించుకున్నారు.
ఇక ఓ మధ్యవర్తి సాయంతో మరో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ పరిచయం అయ్యాడు.
శివప్రసాద్ నిజానికి ఇప్పటికే వివాహమై, కుమార్తె ఉన్నాడు. కానీ నాగమణి దగ్గర ఆస్తి ఉందన్న విషయం తెలిసిన అతడు, ఆ ఆస్తిని దక్కించుకోవాలనే పథకం వేసాడు.
తన భార్య, కుమార్తె కరోనా టైమ్‌లో చనిపోయారని ఫేక్ డెత్ సర్టిఫికెట్లు చూపించి నాగమణిని నమ్మించాడు.
2022లో నాగమణితో పెళ్లి చేసుకుని, తన అసలు రంగు చూపించాడు.
ఆస్తి కోసం రచ్చ:
ఆర్బీఐ నుంచి కోట్లు వస్తాయంటూ, ముందుగా కొంత డబ్బు చెల్లించాలని నాగమణిని నమ్మించాడు.
ఫేక్ డాక్యుమెంట్లు చూపించి ఆమె దగ్గర కోట్లలో డబ్బులు తీసుకున్నాడు.
తన తండ్రి, సోదరుడు, వదిన అకౌంట్లకు ఈ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశాడు.
₹15 కోట్ల భూములు, ₹10 కోట్ల భవనం కూడా అమ్మేశాడు!
నాగమణి దగ్గర బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించాడు.
అంతా తన భర్తే కాబట్టి నమ్మిన నాగమణి చివరికి మోసపోయింది.
సుమారుగా ₹28 కోట్ల వరకు శివప్రసాద్ కాజేసినట్లు తెలుస్తోంది.
నగలు అడిగితే పారిపోయిన అంకుల్:
ఒక రోజు నాగమణి తన నగలు తిరిగి అడగగా, శివప్రసాద్ మాటలు తప్పించుకుంటూ చివరికి పారిపోయాడు.
అతడి ఆచూకీ లభించకపోవడంతో, నాగమణి తనమే శివప్రసాద్ ఊరికి వెళ్ళి నిజం తెలిసుకుంది.
తనకు భార్య, కూతురు ఉన్నా తనను మోసం చేసినట్లు తెలుసుకుని ఆమె షాక్ అయ్యింది.
చివరకు ఎస్పీని కలిసిన బాధితురాలు:
తన వద్ద నుంచి కోట్ల రూపాయలు మోసం చేసిన శివప్రసాద్ పై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.