బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ నాయకులు బాబూరావు,వసంతారావుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన పారిశుధ్య కార్మికులు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను పది గంటలకు పెంచడం,సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం నలభై ఎనిమిది కార్మిక చట్టాలను మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశ వ్యాప్తంగా కార్మిక,కర్షక వర్గాలు సమ్మెకు దిగడం జరిగింది.అందులో భాగంగా ఈరోజు మేము సమ్మెలో పాల్గొంటున్నాం అని తెలిపారు.