బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ ఆధ్వర్యంలో కోడె దాసు,బాబూరావు లు కార్మికులపై అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక,కర్షక వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నాం.విశాఖ ఉక్కు నుండి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేయాలని చూస్తోంది.ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచుతూ జీ ఓ తీసుకువచ్చింది.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయినా కూడా అది అమలు కావడంలేదు.దీనిని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు నడుం బిగించాం అని తెలిపారు.