ఏలూరు నగరంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమ్మెకు సంఘీభావం తెలుపుతూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మోడీ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల్లో భాగంగా జర్నలిస్టులకు సంబంధించి రెండు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు జబీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్రావు, ఏలూరు నగర అధ్యక్షులు హరీష్, జయరాం, తోట వెంకటరావు, ప్రతాప్, పిల్లి మిల్టన్, పలువురు జర్నలిస్టులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
243 Less than a minute