ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం లోని జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం లో 4 లక్షల 50 వెలతో నూతన సిసి రోడ్డు మరియు 3.90లక్షలతో ఊర చెరువు కలవర్టు నిర్మాణానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనగు రవి కుమార్ శంఖస్థాపన చేశారు.అనంతరం కొబ్బరికాయ కొట్టి నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు.గ్రామాల అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఒక సవత్సర కాలం లో నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసామన్నారు.సీయం చంద్ర బాబు డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ సారద్యం లో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు.
244 Less than a minute