కృష్ణాజిల్లా:గుడివాడ పట్టణం లోని 26,27 వార్డుల్లో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని
మాట్లాడుతూ! రాష్ట్రం మెరుగైన పాలన వైపు ముందడుగు వేస్తోందన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటిని పరిష్కరించడానికి సుపరిపాలనలో తొలి అడుగని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
26,27 వార్డు టిడిపి నాయకులు అనుబంధం విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రాము వెంట ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు
231 Less than a minute